భారత ప్రభుత్వం విడుదల చేసిన తాజా 2025 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి ఆకట్టుకుంది. వనరక్షణ, జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) మరియు వాతావరణంలో మెరుగుదల వంటి కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానాన్ని సాధించింది. ప్రకృతి పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తోందని ఈ ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమైంది.
ఈ విభాగాల్లో కర్ణాటక, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వనసంపదను కాపాడడంలో, పర్యావరణ అనుకూల విధానాల అమలులో ఆంధ్రప్రదేశ్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ర్యాంకింగ్ ప్రకటనతో రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Read More : తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

One thought on “ఆంధ్రప్రదేశ్‌కు పర్యావరణ రంగంలో గర్వకారణమైన గౌరవం”
Comments are closed.