పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్ – భారీ భద్రతా ఏర్పాట్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, రెంటపాళ్ల, నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లి ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

రెంటపాళ్లలో జరుగనున్న వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. ఆయన కాన్వాయ్‌కు తోడు మూడు వాహనాలు, 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు వైసీపీ పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతికి మించి కార్యకర్తులు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇక మరోవైపు, నందిగామ అడ్డరోడ్డు వద్ద “గో బ్యాక్ జగన్”, “అమరావతి ద్రోహి జగన్” వంటి నినాదాలతో ఫ్లెక్సీలు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. ఇవి బుధవారం తెల్లవారే సమయానికి పోలీసులు తొలగించారు. అధికార వైసీపీ, విపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతుండటంతో, పల్నాడు జిల్లాలో గణనీయంగా హైటెన్షన్ పరిస్థితి నెలకొంది.

Read More : చిత్తూరులో చెట్టుకు కట్టిన ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర స్పందన

One thought on “పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్ – భారీ భద్రతా ఏర్పాట్లు

Comments are closed.