ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. నిన్న రాత్రి అక్కడికి వచ్చిన లోకేశ్ నేడు, రేపు వరుసగా పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో లోకేశ్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో భేటీ కానున్నారు.
రేపు ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో భేటీ అనంతరం, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను కూడా మంత్రి లోకేశ్ కలవనున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారంపై, విద్యా, ఐటీ రంగాల పురోగతిపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
Read More : చిత్తూరులో చెట్టుకు కట్టిన ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర స్పందన
