ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న ఏసీబీ విచారణ మరింత ఊహించని మలుపులు తిరుగుతోంది. సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి హాజరైన కేటీఆర్‌ను సుమారు ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీ అంశాలపై కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల స్టేట్‌మెంట్ ఆధారంగా దాదాపు 60కు పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. విచారణలో భాగంగా కేటీఆర్ సెల్‌ఫోన్‌ను సీజ్ చేయాలని అధికారులు యత్నించారు. అయితే, ఆ రోజు తన ఫోన్ తన వద్ద లేదని కేటీఆర్ వెల్లడించారు. అయితే రేసు సమయంలో వాడిన ఫోన్‌ను ఈ నెల 18లోగా సబ్‌మిట్ చేయాలని ఏసీబీ ఆదేశించింది.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘‘ఇదంతా లొట్టపీసు కేసు. విచారణలో అసలు విషయాలు ఏమి లేవు. పనికిమాలిన ప్రశ్నలు మాత్రమే వేశారు. రేవంత్ రెడ్డి నన్ను ఏమీ చేయలేడు. అయితే గిత్తే 15 రోజులు జైలుకు పంపించొచ్చేమో’’ అంటూ వ్యాఖ్యానించారు.
విచారణకు ముందు కూడా కేటీఆర్ తన ధైర్యాన్ని ప్రదర్శించారు. అక్రమ కేసులతో భయపడబోమని, అరెస్ట్ చేసినా వెనక్కు తగ్గబోమని, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు.
Read More : కేటీఆర్‌కు మద్దతుగా కవిత.. కాంగ్రెస్‌పై గరంగరంగా విమర్శలు

One thought on “ఏసీబీ విచారణలో కేటీఆర్ స్టేట్‌మెంట్ నమోదు…”
Comments are closed.