తెలంగాణ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఎన్ఎంసీ లేఖ రాసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కనీసం కోవిడ్ టెస్ట్లు కూడా జరగడం లేదని, దేశంలో 90 వేల కరోనా కేసులు ఉన్నా తెలంగాణలో కోవిడ్ కిట్లు లేవని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ ప్రభుత్వానికి ఏ విషయంపైనా స్పష్టత లేదని విమర్శించారు.
రుణమాఫీ, రైతు భరోసా, యువవికాసం తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టత లేకుండా పనులు సాగిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదీ చేయకపోయినా, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని మాత్రం పూర్తిచేసిందని ఎద్దేవా చేశారు. సీఎం క్యాంపు కోసం రోడ్డును కూడా విస్తరిస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లడం సొంత ప్రభుత్వంపై తిరుగుబాటే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే హైదరాబాద్కు 30 టీఎంల నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. గోదావరి-బనకచర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లు, లేఖల ఆధారంగానే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. 90 శాతం అంశాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అయితే రేవంత్ ప్రభుత్వ నేతలు విషయాలు నేర్చుకోకుండా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం

2 thoughts on “రేవంత్ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది”
Comments are closed.