బెంగళూరులో రాపిడో డ్రైవర్‌ దాడి కలకలం

బెంగళూరులో రాపిడో డ్రైవర్‌ దాడి ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఓ యువతి రాపిడో బైక్‌ సర్వీసు బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం యువతి చెల్లింపును నిరాకరించడంతో పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో ఆగ్రహించిన డ్రైవర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. చెంపపై బలంగా కొట్టడంతో యువతి నేలపై పడిపోయింది. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : జనగణనపై కేంద్ర నిర్ణయం