కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు ఊరటపై జగన్ స్పందన

సీనియర్ జర్నలిస్టు, సాక్షి న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఊరటతో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. “సత్యమేవ జయతే” అంటూ తన ట్వీట్‌లో పేర్కొంటూ, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

“సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు లాంటివి. ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తూ, నిరంకుశంగా వ్యవహరించిన చంద్రబాబుకు న్యాయస్థానం గట్టి బుద్ధి చెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగించిన అరెస్ట్‌ను కోర్టు తప్పుబట్టడం అభినందనీయం,” అని జగన్ అన్నారు.

అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతిని, పాలనా వైఫల్యాలను, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఈ కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. “తన ఎల్లో ముఠాతో కలిసి మాయాచూరును సృష్టించి, కొమ్మినేని గారికి చేయని వ్యాఖ్యలను ఆపాదించి విషప్రచారం జరిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్తులను ధ్వంసం చేయిస్తూ రౌడీయిజానికి పాల్పడ్డారు. మహిళల నిరసన పేరుతో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిపించారు. దీనితో మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పాదాలక్రింద నలిపేశారు,” అని విమర్శించారు.

చంద్రబాబు ఈ కుట్రలో రాజకీయ లబ్ధి కోసం ఇంకా మోసపూరిత వ్యాఖ్యలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. “యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని గారికి విశ్లేషకుడి వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ కుట్రను సుప్రీంకోర్టు తీర్పు బట్టబయలు చేసింది. అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎప్పటికీ నిలవవు. సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తుంది… సత్యమేవ జయతే,” అంటూ జగన్ స్పష్టం చేశారు.

Read More : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం

One thought on “కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు ఊరటపై జగన్ స్పందన

Comments are closed.