మెదక్ జిల్లాకు చెందిన యువకుడి ముంబై సముద్రంలో విషాదాంతం.

ముంబై సముద్రతీరంలో ఓ ఆందోళన కలిగించే ఘటన జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనికి చెందిన టంకరి రాము (34) కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకు వెళ్లాడు. విహార యాత్రలో భాగంగా కుటుంబంతో సముద్రంలో బోటు ప్రయాణం చేశాడు. బోటు సఫరిని ముగించుకుని ఒడ్డుకు చేరుకున్న వెంటనే అనుకోని ఘటన చోటుచేసుకుంది.

బోటు దిగిన అనంతరం అకస్మాత్తుగా వచ్చిన భారీ అలల దాటికి రాము సముద్రంలోకి ఒడ్డునుండే కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యుల కంటికి కనిపించే లోపే గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రక్షణ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా అప్పటికే రాము మృతదేహాన్ని వెలికితీశారు.

సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు కొన్ని నిమిషాల ముందు ఆనందంగా గడిపిన తరుణం క్షణాల్లో విషాదంగా మారిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More : మెట్రో కారిడార్-6 పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

One thought on “మెదక్ జిల్లాకు చెందిన యువకుడి ముంబై సముద్రంలో విషాదాంతం.

Comments are closed.