కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు, ఎదురుగా వస్తున్న ఓ లారీతో ఘర్షణకు గురైంది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 16 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతులు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More : అహ్మదాబాద్ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

2 thoughts on “కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం”
Comments are closed.