చెన్నైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా వేస్తున్న రెండు పెద్ద పిల్లర్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు.
నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో పనివారు అక్కడే పని చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. స్తంభాలు కూలిపోగానే, అక్కడ పనిచేస్తున్న కార్మికులు పరిగెత్తారు, మరియు ఒక కార్మికుడు స్తంభానికి పూర్తిగా చిక్కుకున్నాడు, అతను అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన మరో కార్మికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీములు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం అక్రమాలేనని అధికారులు ఇప్పటికే అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మెట్రో అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
ఈ ప్రమాదంతో రామపురం ప్రాంతంలో తీవ్ర కలకలం ఏర్పడింది. కొద్దిసేపటికి ట్రాఫిక్‌ను కూడా ఆపివేశారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Read More : తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పైలట్

One thought on “చెన్నై రామపురంలో మెట్రో పిల్లర్లు కూలి ఒకరు ?”
Comments are closed.