తెలంగాణలో భారీ రియల్ ఎస్టేట్ మోసం

తెలంగాణలో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలోని కొందుర్గ్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ “పూర్వ్ ఆభాస్ – ది డ్రీమ్ డెస్టినేషన్” పేరుతో ప్రజలకు ప్లాట్లు ఇవ్వనున్నట్లు వాగ్దానం చేసి, భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది.

EMI పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చినా, సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. తమ జీవిత సొమ్మును పెట్టుబడి పెట్టి మోసపోయామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మోసం గురించి అధికారులు దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. పెద్దఎత్తున డబ్బులు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్న ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read More : తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

One thought on “తెలంగాణలో భారీ రియల్ ఎస్టేట్ మోసం

Comments are closed.