ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో మంగ్లీ స్పందించారు. నిన్న రాత్రి సెల్ఫీ వీడియో ద్వారా తన వాఖ్యను వెల్లడించారు. తనకు ఎలాంటి తప్పు జరిగిందన్న అనుభూతి లేదని, తెలియక పొరపాటు జరిగిందని వివరించారు. ‘‘నా పుట్టినరోజు వేడుకను మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో నిర్వహించాం. మద్యం, సౌండ్ సిస్టమ్ ఉన్నా, వీటి నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం నాకు తెలియదు. ఎవరు చెప్పిన ఉంటే తప్పకుండా అనుమతి తీసుకున్నేదాన్ని. పార్టీ సడన్‌గా ప్లాన్ చేయడం జరిగింది,’’ అన్నారు.
అలాగే రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఇతర మత్తు పదార్థాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. పోలీసులు తనిఖీలు చేసినప్పటికీ గంజాయి లేదా ఇతర నిషేధిత పదార్థాలు ఏవీ పట్టుబడలేదని తెలిపారు. గంజాయి తాగినట్టు పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే ఎక్కడో, ఎప్పుడో తీసుకున్నట్టు పోలీసులే వెల్లడించారని చెప్పారు. ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని, తాము పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నామని వివరించారు.
‘‘నా తల్లిదండ్రులు ఉన్న చోట ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తారా? నేను రోల్ మోడల్‌గా ఉండాలని భావిస్తున్నాను. కావున ఎలాంటి తప్పు చేయలేదు. మీడియాలో ప్రస్తావిస్తున్న ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దు’’ అని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More : నిఖిల్ ‘ది ఇండియన్ హౌస్’ షూటింగ్‌లో ప్రమాదం

One thought on “మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై కేసు, ఆమె క్లారిటీ వీడియో వైరల్.”
Comments are closed.