బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విషాద ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తొక్కిసలాట కారణంగా 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), **కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)**పై పోలీసులు క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ DNA సంస్థపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
పబ్లిక్ గేదరింగ్కు అనుమతి ఉండగానే, విక్టరీ పరేడ్ నిర్వహించడానికి RCB చేసిన ప్రయత్నంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు, “విక్టరీ పరేడ్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ RCB అధికారికంగా నిన్న ట్వీట్ చేయడంపై పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నారు.
అంతేకాదు, ఈ వేడుకలను సండేకు వాయిదా వేసుకోవాలని ముందుగానే పోలీసులు సూచించినప్పటికీ, నిర్వాహకులు– RCB యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరుగుతూ అమాయకుల ప్రాణాలు పోయాయని వివరించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

Read More : ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో విషాదం

One thought on “బెంగళూరు : కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌పై క్రిమినల్ కేసు నమోదు.”
Comments are closed.