IPL ఫైనల్‌కు త్రివిధ దళాల చీఫ్‌లకు బీసీసీఐ ఆహ్వానం

బీసీసీఐ తీసుకున్న నిర్ణయం దేశభక్తి భావాలను ప్రతిబింబిస్తోంది. బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా భారత సాయుధ దళాలకు గౌరవం తెలిపే విధంగా ముందడుగు వేసింది.

రాబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు మూడు భారత సర్వీసుల చీఫ్‌లను ఆహ్వానించినట్లు బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమల్ తెలిపారు. జూన్ 3, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్టు తెలిపారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు ఐపీఎల్ వేదికగా గౌరవం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించిందని ధూమల్ అన్నారు. ఈ ఆహ్వానం దేశ భద్రతా బలగాలపై ప్రజల్లో గౌరవాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ చర్యను క్రీడా వర్గాలతో పాటు ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.

Read More : కారు జనంపై దూసుకెళ్లి 50 మందికి గాయాలు

One thought on “IPL ఫైనల్‌కు త్రివిధ దళాల చీఫ్‌లకు బీసీసీఐ ఆహ్వానం

Comments are closed.