TDP : ఆరు శాసనాలతో కొత్త కార్యాచరణ

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు అగ్రనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు ప్రాంగణం పెద్ద ఉత్సాహంతో నిండిపోయింది. కార్యక్రమంలో టీడీపీ కొత్త ప్రయాణాన్ని సూచించే “నా తెలుగు కుటుంబం” లోగోను ఆవిష్కరించారు.

లోగో ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన నారా లోకేష్, తెలుగు ప్రజల సమగ్రాభివృద్ధి, సంక్షేమమే పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆరు కీలక శాసనాలతో కూడిన కార్యాచరణను తాము రూపొందించామని, ఈ శాసనాలు ప్రజల ఆశయాలకు నిబద్ధతగా అమలు కాబోతున్నాయని వెల్లడించారు.

ప్రజల అవసరాలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఈ ఆరు శాసనాలు రూపొందించామని, వాటిని పవిత్ర బాధ్యతగా స్వీకరించి, అక్షరాలా అమలు చేస్తామన్నారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని లోకేష్ వ్యక్తపరిచారు.

Read More : తెలుగుదేశం జెండా అంటే తెలుగు జాతికి అండ