వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు (బుధవారం) ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా, వాతావరణ శాఖ తీవ్ర వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో పర్యటనను వాయిదా వేసినట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది.
వర్షాలు తగ్గి పరిస్థితులు అనుకూలించాక పర్యటన తేదీపై మరల వెల్లడిస్తామని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పర్యటనలో భాగంగా జగన్, పొగాకు రైతులను ప్రత్యక్షంగా కలసి వారి సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతోపోపాటు, మద్దతు ధరలపై స్పందించనున్నారు.
ప్రస్తుతం మద్దతు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ ఈ పర్యటనను పథకం వేసినట్లు తెలుస్తోంది. వాతావరణం సహకరించే దాకా పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది.
Read More : కడపలో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు ప్రారంభం.

One thought on “YS జగన్ పొదిలి పర్యటన వాయిదా”
Comments are closed.