కేతిక శర్మకు రవితేజ సినిమా ఛాన్స్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తదుపరి సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపికలో రాత్రికి రాత్రే మేజర్ ట్విస్ట్ జరిగింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో కేతిక శర్మకు లీడ్ రోల్ దక్కినట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కథ ఫైనల్ కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందని సమాచారం. మొదటగా కయదా లోహార్, మమితా బైజు పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉండగా… ఇప్పుడు అప్‌డేట్ ప్రకారం కేతిక శర్మ మెయిన్ లీడ్‌గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ చర్చల్లో కేతిక పేరు ఎప్పుడూ వినిపించలేదు. కానీ ఆమె పేరు పరిశీలనలోకి వచ్చిన క్షణం నుంచే పరిస్థితే మారిపోయింది. కథానాయిక ఎంపిక విషయంలో కేతిక చాకచక్యంగా వ్యవహరించి ఛాన్స్‌ను తనవైపు తిప్పుకోగలిగింది.

ఇప్పటికే కేతికతో అగ్రిమెంట్ కుదిరినట్లు సమాచారం. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే ఆమె నటించిన ‘సింగిల్’ చిత్రం విజయవంతం కావడంతో మళ్లీ బౌన్స్‌బ్యాక్ అయిన కేతికకు ఇది వరుసగా వచ్చిన మంచి అవకాశం.

కేతిక శర్మ ‘రొమాంటిక్’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కొన్ని చిత్రాలు చేసినా పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ ‘సింగిల్’ సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. ఇప్పుడు రవితేజ లాంటి స్టార్‌తో సినిమా చేయడం ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలవనుంది.

ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇక మిగతా కథానాయిక పాత్రలో ఎవరిని తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

Read More : థియేటర్లు మూసివేత జోక్ కాదు: దిల్‌రాజు స్పందన.

One thought on “కేతిక శర్మకు రవితేజ సినిమా ఛాన్స్

Comments are closed.