హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 అంతర్జాతీయ అందాల పోటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ, ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్‌లో పాల్గొంటున్న ఆమె, భావోద్వేగాలతో కుమిలిపోయి పోటీలో నుంచి తప్పుకొన్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఈ మేరకు SUN పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
“ఈ పోటీకి వచ్చిన మొదటి రోజు నుంచే నన్ను వేశ్యలా చూస్తున్నారనే భావన కలిగింది. నా డ్రెస్, నడక, ప్రవర్తనలపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వల్ల నేను మానసికంగా తీవ్ర స్థాయిలో బాధపడాను. ఇలా అభాసుపాలవుతున్న పరిస్థితుల్లో ఇక పోటీలో కొనసాగడం నాకు అసాధ్యమైపోయింది,” అంటూ మిల్లా మాగీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అందాల పోటీ వేదికపై అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రతిభలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భంలో ఆమెపై జరిగిన అవమానకర పరిస్థితులు మరొకసారి ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్షాన్ని ప్రశ్నిస్తోంది. మిల్లా వ్యాఖ్యలతో మిస్ వరల్డ్ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల స్వాభిమానాన్ని త్రోసిపోస్తూ జరుగుతున్న ఈవెంట్‌పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లా మాగీ పోటీలో అనేక అంచనాల మధ్య దూసుకొచ్చినా, ఈ చేదు అనుభవంతో వెనక్కి తగ్గాల్సి రావడం గుండెను కలిచివేస్తోంది. మహిళల పట్ల గౌరవభరితమైన దృక్పథం అవసరమనే మరోసారి ఈ ఘటన ముక్తకంఠంగా చెబుతోంది.

Read More : హైదరాబాద్ మెట్రో టికెట్ ఛార్జీల్లో సవరణ

2 thoughts on ““నన్ను వేశ్యలా చూశారు” అంటూ ఆవేదన”
Comments are closed.