వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీం కోర్టులో పూర్తి విచారణ.

వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గురువారం విచారణ ముగిసింది. ప్రధానంగా, వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయాలంటూ పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ చట్టం లౌకిక రాజ్యాంగ ప్రాతిపదికకు వ్యతిరేకమని పేర్కొంటూ, దీన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలను ఖండించింది. వక్ఫ్ చట్టం దేశంలోని లౌకికతకు భంగం కలిగించేది కాదని, అది చట్టబద్ధంగా ప్రవేశపెట్టబడినదని స్పష్టం చేసింది. ఇది మతపరమైన సంస్థల నిర్వహణ కోసం ఉన్న చట్టమే తప్ప, దీనిని నిలిపివేయాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

వాదనలు పూర్తి అయిన అనంతరం, జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పును రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టంలో సవరణలు, వాటి ప్రభావాలపై ఈ తీర్పు కీలకంగా మారనుంది.

Read More : పహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ తో కఠిన ప్రతీకారం