పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ గట్టిగా స్పందించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం విషయంలో న్యాయస్థాన తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెబుతూ బీఆర్ఎస్ నాయకులు తమను నీతిమంతులుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఈ పథకం అవకతవకలపై కోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని ఆ కేసును నీరసపర్చారని మండిపడ్డారు. ప్రస్తుతం నాగం బీఆర్ఎస్లో ఉండగా, ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై ఎలా పోరాటం చేస్తారని ప్రశ్నించారు.
కేటీఆర్ మాట్లాడుతూ తమ హయాంలో అవినీతి జరగలేదంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నిజంగా ధైర్యం ఉంటే పాలమూరు పథకంపై సీఐడీ లేదా జ్యుడిషియల్ విచారణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. అప్పుడు ఈ పథకంలో జరిగిన అవినీతి బయటపడుతుందని స్పష్టం చేశారు. నిజాయితీని నిరూపించుకోవాలంటే కేటీఆర్ విచారణకు అంగీకరించాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
Read More : న్యాయస్థానంలో రెండవసారి హాజరైన సీఎం

One thought on “కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ప్రతిస్పందన”
Comments are closed.