తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ముదిరుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో 500 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోతే, సీఎం మాత్రం అందాల పోటీల్లో పాల్గొనడమే ముఖ్యంగా భావిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, కమిషన్లకే మొగ్గు చూపుతోందని ఆరోపించారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం నిత్యం కమిషన్లపై నడుస్తోందన్నారు. వడ్లను కొనుగోలు చేసే వారి గాక, తరలించే వారు కూడా లేని పరిస్థితి నెలకొంది. స్థానిక నాయకులే కనపడడం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంలోని అవ్యవస్థలే బహిర్గతం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి “మా మంత్రులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారు” అని స్వయంగా చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు – “ఫైల్ కదలాలంటే మంత్రుల చెయ్యి తడపాల్సిందే” అన్న ఆమె మాటలు ప్రభుత్వంలో వ్యవస్థల పని తీరు ఎలా ఉందో వెల్లడిస్తున్నాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పాలన కన్నా ప్రజలపై చూపాల్సిన శ్రద్ధ కొరవడిందని, సీఎం రేవంత్ రెడ్డి నిస్సారంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

2 thoughts on “సీఎం పై కేటీఆర్ మండిపాటు.”
Comments are closed.