INS విక్రాంత్‌పై దాడి చేశామని అపార్థ ప్రచారం

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ తక్షణమే కౌంటర్‌ చర్యలతో స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం పాక్‌కు గట్టి బుద్ధి చెప్పినప్పటికీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం అసత్య ప్రచారాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇటీవల కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. భారత నౌకాదళానికి చెందిన INS విక్రాంత్‌పై పాకిస్థాన్ వైమానిక దళం దాడి చేసి ధ్వంసం చేశామని షరీఫ్ ఘనంగా చెప్పుకున్నారు. “INS విక్రాంత్ కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చి ఉండగా, మన దళాలు దానిపై తీవ్ర దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాయి. దెబ్బకు అది వెనక్కి పారిపోయింది” అని పేర్కొన్నారు.

అయితే షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవు. భారత్ అధికారికంగా దీనిపై స్పందించలేదు కానీ, నౌకాదళానికి చెందిన INS విక్రాంత్ సురక్షితంగా ఉంది. ఇది పూర్తిగా పచ్చి అబద్ధం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటువంటి అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో భ్రమలు కలిగించటమే లక్ష్యంగా షరీఫ్ వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైనిక స్థాయిలో ఎదురైన దెబ్బను ప్రజల్లో మరోలా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : ఏడాదిలో 25 మంది యువకులను మోసగించిన అనురాధ అరెస్ట్.