మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతులు పెళ్లి అనంతరం హనీమూన్‌కు మేఘాలయ వెళ్లగా, వారి కొత్త జీవితం అత్యంత విషాదాంతంగా ముగిసింది. ప్రకృతిసౌందర్యంతో ఆకట్టుకునే మేఘాలయలో ఈ దంపతుల మధ్య ప్రేమకథ తాలూకూ ఓ రక్తపాతం కథగా మారింది.
మే 20న హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ చేరిన ఈ దంపతులు, మే 22న నోంగ్రియాట్ గ్రామంలోని ప్రసిద్ధ లివింగ్ రూట్ బ్రిడ్జ్ వద్ద బస చేశారు. మే 23న స్కూటర్‌పై ప్రయాణానికి బయలుదేరిన దంపతుల మధ్య సంబంధాలు కట్ కావడం, ఆ తర్వాత భర్త హత్య జరగడం దుర్ఘటనకు దారితీసింది. విచారణలో భార్య సోనమ్, తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేయించినట్టు పోలీసులు గుర్తించారు.
ప్లాన్ ప్రకారం, స్కూటర్‌పై వెళ్తుండగా సోనమ్ అలసిపోయినట్లు నటించిందని, ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన హంతకులు రాజాను లోయలోకి నెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని రోజుల తర్వాత రాజా మృతదేహం లోయలో లభ్యమైంది.
పోలీసులు సోనమ్ కదలికలను ట్రేస్ చేసి, ఆమెను ఘాజీపూర్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోనమ్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు, వారిని మరింత విచారణ కోసం షిల్లాంగ్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఆధారాలు సేకరిస్తూ కేసును లోతుగా పరిశీలిస్తున్నారు.
ఈ హృదయవిదారకమైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, నమ్మకాలను తాకిన ఈ హత్య యథార్థంలో ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.
Read More : హనీమూన్ హత్య కేసులో రాజ్ కుష్వాహా అమాయకుడు?
