ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారికి మాజీ సీఎం ఘన నివాళి.

ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన సేవలను స్మరించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన అమరగాథను స్మరించిన జగన్, రాష్ట్ర పురోగతికి, ప్రజల హక్కుల కోసం ఆయ‌న అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం పంతులు, నిర్భయంగా బ్రిటిష్ అధికారులకు ఎదురయ్యారు. ఆయ‌న ధైర్యం, త్యాగం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బలాన్ని చేకూర్చిందని జగన్ అన్నారు.

ఈ సందర్బంగా నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా ఆయన స్ఫూర్తిదాయక జీవితం గురించి గుర్తుచేసుకుంటూ, నివాళులు అర్పించారు.

One thought on “ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారికి మాజీ సీఎం ఘన నివాళి.

Comments are closed.