శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ పాజిటివ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా కలకలం రేపింది. మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి, నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు.

శిల్పా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న శిల్పా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా, ఫలితం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కోవిడ్ పాజిటివ్ విషయం వెలుగు రావడంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ముందు జాగ్రత్త చర్యలుగా పరీక్షలు చేయించుకుంటున్నారు. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Read More : టాలీవుడ్ యంగ్ హీరో మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం…

One thought on “శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ పాజిటివ్

Comments are closed.