రాత్రిపూట ఫోన్‌ను దిండు పక్కన పెట్టి నిద్రపోతున్నారా?

ఈ రోజుల్లో ఫోన్‌ల మోజు ఎంతవరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజంతా చేతిలో ఫోన్ ఉండటమే కాదు, నిద్రించే సమయానికీ దిండు పక్కన ఉంచే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి తీవ్రంగా హానికరమని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా అనేక ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేమంటే, రాత్రిపూట మొబైల్ ఫోన్‌ను దిండు పక్కన పెట్టుకుని నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు, నిద్ర నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ మెదడును ఉల్లాసంగా ఉంచి, నిద్రకు విఘాతం కలిగించడమే కాదు, దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతే ఎదురయ్యే ప్రమాదాలు:

  • ఫోన్‌ స్క్రీన్ వెలుతురు మెదడును చురుగ్గా ఉంచుతుంది, దీని వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది.
  • మొబైల్ ఫోన్ రేడియేషన్ మెదడుపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది.
  • నిద్రకు ముందు ఫోన్‌ చూడడం వల్ల కళ్ళకు ఒత్తిడి పెరుగుతుంది.
  • నిద్రలేమి వల్ల ఆందోళన, నిరాశ, మానసిక స్థైర్య లోపం కలగొచ్చు.
  • ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ వేడెక్కి పేలే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎంతో అవసరమైతేనైతే ఫోన్‌ను బెడ్‌కు దగ్గరగా ఉంచకండి. కనీసం 3 అడుగుల దూరంలో ఉంచడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి నిద్రను ప్రశాంతంగా, సురక్షితంగా గడిపేందుకు ఈ అలవాట్లను మార్చుకోవడం అత్యవసరం.

Read More : హెల్తీ ఫుడ్స్ పేరుతో మోసం