హర్యానాలో పాక్ గూఢచారిగా విద్యార్థి అరెస్ట్

హర్యానాలో పాక్ గూఢచారిగా పని చేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో కర్తార్‌పుర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిసినట్లు పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం పటియాలలో పోలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 25 ఏళ్ల దేవేంద్ర సింగ్, ఫేస్‌బుక్‌లో గన్, పిస్టల్ ఫొటోలు పోస్ట్ చేసినందున అతనిపై నిఘా పెట్టి పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ ఐఎస్ఐ హానీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ను తమ గుప్పెట్‌లో పెట్టుకున్నట్టు చెప్పబడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలు, ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్‌కు అందించాడని అధికారులు పేర్కొన్నారు.

Read More : AIIMS రిషికేష్ హెలీ అంబులెన్స్ కేదార్నాథ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.