తిరుమలలో భక్తుల భారీ రద్దీ: 20 గంటల పాటు లైన్లో ఎదురు చూపులు

వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకు లైనులో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించవచ్చని తితిదే వెల్లడించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం ఉదయం సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించవలసినట్లు మైక్సెట్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులకు పాలు, నీరు, అన్నప్రసాదాలు అందజేయబడుతున్నాయి. బుధవారం శ్రీవారిని 73,301 మంది భక్తులు దర్శించుకున్నారు, ఆ సమయంలో హుండీ కానుకలుగా రూ.4.14 కోట్లు సేకరించారు.