పాకిస్థాన్‌తో తమ దేశానికి ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటుతూ, టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచైనా, చెడైనా పాకిస్థాన్ వెంటే టర్కీ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నిజమైన స్నేహానికి పాకిస్థానే నిదర్శనం. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ఆప్త మిత్రుడు. భవిష్యత్తులో పాకిస్థాన్‌కు ఏవైనా అవసరాలు ఉంటే, టర్కీ నుంచి పూర్తి సహాయం అందుతుంది,” అని ఎర్డోగాన్ చెప్పారు.
ఈ వ్యాఖ్యలు భారత్‌తో పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వెలువడడం గమనార్హం. గతంలో కూడా పాకిస్థాన్‌కు డ్రోన్‌లు, ఆర్మీ సపోర్ట్ వంటి రకాలుగా సహాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఆ దేశం పట్ల టర్కీ మద్దతును మరోసారి స్పష్టం చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ అధ్యక్షుడి మాటలు భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Read More : పాక్ ప్రకటన కలకలం.

One thought on ““నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్””
Comments are closed.