ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన క్రిస్టియానో రొనాల్డో కుమారుడు క్రిస్టియానో డాస్ శాంటోస్ జూనియర్, తన తండ్రి బాటలోనే పయనిస్తూ ఫుట్‌బాల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన వ్లాట్కో మార్కోవిక్ అంతర్జాతీయ టోర్నమెంట్లో పోర్చుగల్ అండర్-15 జట్టు జూనియర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ యువ జట్టు 4-1 తేడాతో జపాన్‌పై విజయం సాధించింది.
తన కుమారుడు పోర్చుగల్ జట్టులోకి అరంగేట్రం చేయడంపై క్రిస్టియానో రొనాల్డో ఆనందం వ్యక్తం చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో “బిడ్డా, పోర్చుగల్ సంస్థ నీ అరంగేట్రానికి అభినందనలు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను!” అని చెప్పారు.
Read More : కవలలకంటే ఎక్కువగా ఉన్న వారి కెరీర్ పోలికలు
