ఆఫ్రిది మరోసారి వివాదాస్పదంగా!

ఇటీవల భారత్‌పై యుద్ధం గెలిచామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ వైపు నుండి సీజ్ ఫైర్ కోసం ఎలాంటి అభ్యర్థన లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యుద్ధంలో నిజం ఏమిటో స్పష్టంగా ఉండగా, ఈ తరహా లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ పాకిస్థాన్ నాయకత్వం ప్రజలను మభ్యపెడుతోంది.

ఇందులో భాగంగా, ఇప్పుడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కూడా ముందుకొచ్చాడు. కరాచీలో సోమవారం జరిగిన ‘విక్టరీ ర్యాలీ’లో పాల్గొన్న ఆఫ్రిది, మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఇది మొదటిసారి కాదు. గతంలో పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత ప్రభుత్వం, సైన్యం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆఫ్రిది… పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK) నిర్వహించిన ర్యాలీలో కూడా పాక్‌కు అనుకూలంగా మాట్లాడాడు. ఈ తరహా ప్రవర్తనతో షాహిద్ ఆఫ్రిది పై భారత వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పాక్ నాయకులు, మాజీ క్రికెటర్లు దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : పాకిస్థాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం

One thought on “ఆఫ్రిది మరోసారి వివాదాస్పదంగా!

Comments are closed.