పెళ్లైన మూడు రోజులకే జవాన్ మనోజ్ పాటిల్‌కు బోర్డర్‌కు తిరిగి రావాలన్న ఆర్మీ పిలుపు వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ ఈ నెల 5న యామినితో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం సెలవుల్లో ఉన్న ఆయనకు, భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బోర్డర్‌కు హాజరయ్యే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇటు భర్తను కన్నీటితో వీడుతున్న యామిని, “నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా” అంటూ భావోద్వేగంగా స్పందించింది. పెళ్లి అయిన మూడు రోజుల్లోనే మనోజ్ దేశ సేవలో మళ్లీ చేరుతుండటంతో కుటుంబ సభ్యులంతా ఉద్వేగానికి లోనయ్యారు.
జవాన్ల త్యాగం, దేశ భక్తిని ప్రతిబింబించే ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతానికి వైరల్‌గా మారింది. దేశ రక్షణ కోసం త్యాగాలు చేయాల్సిన స్థితికి వచ్చిన కుటుంబాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మిలిటరీ వర్గాలు, అధికారిక వర్గాలు పాక్ కదలికలపై అప్రమత్తమయ్యాయని సమాచారం.
ఇలాంటి క్షణాల్లో జవాన్ల మనోబలాన్ని నిలబెట్టేలా, ప్రజల మద్దతు అత్యంత అవసరం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

One thought on “పెళ్లైన జవాన్ మనోజ్ పాటిల్ దేశసేవలోకి.”
Comments are closed.