Update : శ్రీనగర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై దోపిడీ యత్నం

శ్రీనగర్‌లోని ఢాకా-మావా ఎక్స్‌ప్రెస్‌వేపై దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటన కలకలం రేపుతోంది. రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డంగా వేసి కారును ఆపేందుకు దోపిడీ దొంగలు ప్రయత్నించగా, డ్రైవర్ చాకచక్యంతో పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్నారు.

ఈ దృశ్యం కారులోని డ్యాష్‌క్యామ్‌లో స్పష్టంగా రికార్డైంది. వెంటనే ఘటనపై సంబంధిత డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్పందించిన పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. పోలీసులు ఘటనపై మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

ఇలాంటి ఘటనల విషయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Read More : పాకిస్తాన్‌కు భారీ షాక్.. ప్రత్యేక దేశంగా బలూచిస్థాన్‌.

One thought on “Update : శ్రీనగర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై దోపిడీ యత్నం

Comments are closed.