భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, సింధు నదీ జలాల ఒప్పందం అమలుపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. “ఈ వివాదంలో ప్రపంచ బ్యాంక్ పాత్ర కేవలం సహాయకుడిగా మాత్రమే ఉంది,” అని బంగా స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన ఆయన, ఆర్థిక సహాయానికి సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందంపై అమలును నిలిపివేసిన నేపధ్యంలో బంగా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ అమెరికన్‌గా, అలాగే తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన అజయ్ బంగా వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Read More : ఉగ్రవాదుల చొరబాటును బీఎస్ఎఫ్ సమర్థవంతంగా అడ్డుకుంది

One thought on “భారత్ పర్యటనలో అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు”
Comments are closed.