మసూద్ అజార్ కుటుంబ సభ్యుల మృతి…

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారీ దాడులు జరిపాయి. తెల్లవారుజామున 1:05 గంటల సమయంలో భారత వైమానిక దళాలు క్షిపణులతో ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులకు దిగాయి.

ఈ ఆపరేషన్‌లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యంత కీలకమైన దాడి పాక్‌లోని బహవల్‌పూర్ ప్రాంతంలో జరగ్గా, అందులో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నారు.

ఈ దాడుల్లో తన కుటుంబానికి చెందిన నలుగురు సహాయకులు సహా 14 మంది మృతిచెందారని మసూద్ అజార్ స్వయంగా పేర్కొన్నట్లు బీబీసీ ఉర్దూ నివేదించింది. ఈ ఘటన ఉగ్రవాద మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసినట్లు తెలుస్తోంది. భారత్ ఈ చర్యలతో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఇకపోతే, ఈ మెరుపుదాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More : పాక్ కుట్ర బహిరంగం

One thought on “మసూద్ అజార్ కుటుంబ సభ్యుల మృతి…

Comments are closed.