రాయలసీమ వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కడుపు మండి హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్తాం అంటూ వైసీపీ నేతలను గట్టిగా హెచ్చరించారు. సోమవారం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… హిందూపురం గడ్డ దివంగత ఎన్టీఆర్కు రెండో పుట్టినిల్లు లాంటిదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల బాధ్యతలు నెరవేర్చే పార్టీ. సీఎం చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు. ఏడాదిలోనే రూ. 50 కోట్ల అభివృద్ధి పనులు పూర్తిచేశాం. త్వరలోనే శాశ్వత తాగునీటి పథకానికి రూ. 136 కోట్ల ప్రాజెక్ట్ సిద్ధం అని వివరించారు.
మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 1984లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తూముకుంట వద్ద ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ గురించి గుర్తు చేస్తూ, హిందూపురం ప్రజల అభివృద్ధే తమ ధ్యేయమని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, ప్రజా ఆస్తులను రక్షించటమే తమ కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు.
Read More : విశాఖపట్నంలో చెట్టు కూలి మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాదం

One thought on “హిందూపురం టీడీపీ గడ్డ..”
Comments are closed.