ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు పాటించాలని చెప్పే పోలీసులు తామే నిబంధనలు ఉల్లంఘిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఆర్‌టీఐ సమాచారం ప్రకారం, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వాహనాలపై ఇప్పటివరకు 17,391 చలాన్లు నమోదయ్యాయి. వీటి విలువ మొత్తం రూ.68.67 లక్షలుగా ఉంది.
లోకేంద్ర సింగ్ అనే వ్యక్తి వేసిన ఆర్‌టీఐకు ట్రాఫిక్ శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. ప్రతి రోజూ చలాన్లు కట్టించేందుకు వాహనదారులను ఆపే పోలీసులే తమ వాహనాలపై ఉన్న చలాన్లను మాత్రం పట్టించుకోకపోవడం పెద్ద విమర్శకు దారి తీసింది.
ప్రజలకు నిబంధనలు అమలు చేయించే వారు తామే వాటిని తుంగలో తొక్కితే ప్రజల్లో ఆ నియమాల పట్ల నమ్మకమే పోతుందని ట్రాఫిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి డబ్బులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్నదానిపై అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.

One thought on “పోలీసుల వాహనాలపై వేలాది చలాన్లు!”
Comments are closed.