ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. మీడియాతో మాట్లాడుతూ, “ఇది పూర్తిగా అనూహ్య ఘటన. రెండు రోజుల క్రితమే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాను. భారీ వర్షంతో అకస్మాత్తుగా గోడ కూలింది. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాం,” అని పేర్కొన్నారు.
గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి వెల్లడించారు. నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించాయా? నాణ్యత లోపముందా? ఎవరెవరు బాధ్యులు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఎవరు బాధ్యులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం తరఫున మరణించిన భక్తుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి దేవాదాయ శాఖ పరిధిలో ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. “ప్రభుత్వం మీతో ఉంది” అని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమై దర్యాప్తును వేగవంతం చేసింది. బాధితులకు న్యాయం జరుగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.
Read More : వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన

One thought on “సింహాచలం చందనోత్సవంలో విషాదం”
Comments are closed.