వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన

ys jagan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో భాగంగా సింహాచల గోడ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను, గాయపడిన భక్తులను పరామర్శించనున్నారు. ఈ ఉదయం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన నేరుగా కేజీహెచ్‌కి వెళ్లి, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద గోడ కూలడంతో భక్తులు ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకమని వ్యాఖ్యానించారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇలాంటి విషాదానికి గురయ్యారు అన్నది బాధాకరమని తెలిపారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలనే సూచనలు ప్రభుత్వానికి ఇచ్చిన జగన్… మృతుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు విశాఖలో భారీ బందోబస్తు ఏర్పాటైంది.

Read More : సింహాచలంలో దుర్ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి..

One thought on “వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన

Comments are closed.