పహల్గాంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు.
ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ… రాష్ట్రంలో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వెంటనే వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమిత్ షా సూచనలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 200 మందికి పైగా పాకిస్థాన్ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హై అలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కదలికలపై భద్రతా వ్యవస్థ తీవ్ర నిఘా కొనసాగిస్తోంది. పాకిస్థాన్ పౌరుల వీసాలు ఈ నెల 27వ తేదీ నాటికి పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది.
Read More : తెలంగాణ సీఎం హైకోర్టులో ఊరట

One thought on “హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాక్ పౌరులు…”
Comments are closed.