జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్లో చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా స్పందిస్తుండగా, పాకిస్తానీ నటులపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
ఈ ఘటన ప్రభావం సినీ ఇండస్ట్రీపైనూ పడింది. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తండ్రి పాకిస్తాన్ మిలటరీలో ఉన్నత పదవిలో ఉన్నారని వార్తలు రావడంతో, ఈ చిత్రం నుంచి ఆమెను తొలగించాలన్న డిమాండ్లు ముమ్మరమయ్యాయి.
ఇక మరోవైపు, పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ చిత్రం కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీని విడుదల చేయకుండా అడ్డుకోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ సినిమాను బహిష్కరించాలన్న హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాల భవితవ్యం ప్రస్తుతం అనిశ్చితంగా మారింది. పాకిస్తానీ నటులతో రూపొందుతున్న ప్రాజెక్టులపై భారతీయుల భావోద్వేగాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిణామాలతో చిత్ర పరిశ్రమ మరింత అప్రమత్తమవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

One thought on “పహల్గామ్ ఎఫెక్ట్: రెండు పెద్ద సినిమాలకు బంపర్ షాక్”
Comments are closed.