హీరోగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న నాని, దసరా తర్వాత స్ట్రాటజీ మార్చుకుని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. తాజా సినిమా హిట్ 3 మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
హిట్ 3కి తానే హీరో, తానే నిర్మాత కావడంతో ప్రమోషన్ల విషయంలో నాని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా మేజర్ సిటీస్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోయిన్ శ్రీనిధిశెట్టి కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఏప్రిల్ 30 నుంచి మే 6 వరకు నాని, శ్రీనిధిశెట్టి కలిసి యుఎస్‌లో పర్యటించనున్నారు. డల్లాస్, ఆస్టిన్, సియాటిల్, లాస్ ఏంజిల్స్, కాన్సాస్‌ల్లో అభిమానులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రతి సినిమాపై నాని చూపించే డెడికేషన్ హిట్ 3 ప్రమోషన్లలో మరోసారి కనిపిస్తోంది. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రచారానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

One thought on “నాని–శ్రీనిధి యుఎస్ టూర్.. హిట్ 3 కోసం గ్రాండ్ ప్రమోషన్స్!”
Comments are closed.