జేడీ వాన్స్ ప్రకటించిన కీలక పరిణామాలు

జేడీ వాన్స్, తన సతీమణి ఉషా వాన్స్, మరియు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌లతో సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం వారిని ఘనంగా స్వాగతించింది. ఈ సందర్భంగా వారు చారిత్రక ఆమెర్ కోటను సందర్శించారు.

అంతకుముందు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జేడీ వాన్స్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. రక్షణ సహకారం, ఇంధనం, ఆధునిక సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలపై చర్చించామని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై గణనీయమైన పురోగతి సాధించామన్నారు.

వాన్స్, జైపూర్ ప్రసంగంలో భారత్‌తో సంబంధాలు బలోపేతం చేయడం తమ లక్ష్యం అని తెలిపారు. “గతంలో కొన్నిసార్లు వాషింగ్టన్ ప్రధాని మోదీకి బోధించే విధానంతో వ్యవహరించింది. మేము దానికోసం ఇక్కడ రాలేదు,” అని వాన్స్ చెప్పారు.

Read More : ఈ వేసవిలో అమెరికాకు విమాన చార్జీలు ఆశ్చర్యకరంగా తగ్గినవి