టాలీవుడ్ సీనియర్ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రూపేష్ అక్షయ్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. సంగీత మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా, అర్చన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి స్పందన పొందాయి.
హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో టీజర్‌ను విడుదల చేశారు. “షష్టిపూర్తి మాత్రం జరిపించండి” అనే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్‌తో టీజర్ మొదలై, కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగింది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ మిక్స్‌తో టీజర్ ఆకట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్ చెప్పిన “నిన్ను చూసి పారిపోయిన వాళ్లు ఇప్పుడు నిన్ను పొగుడుతుంటే…” అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
టీజర్ చూసిన నెటిజన్లు మంచి స్పందన చూపిస్తున్నారు. తెలుగుతనం ఉట్టి పడేలా సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చినట్లు అనిపిస్తోంది.
MAA AAI ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రధానంగా చూపించే ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి సినిమా కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి.

One thought on “ఫ్యామిలీ ఎమోషన్‌తో మెప్పించిన ‘షష్టిపూర్తి’ టీజర్”
Comments are closed.