మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎన్టీఆర్-నీల్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చిత్ర షూటింగ్ ప్రారంభమై ఉండగా, తాజాగా ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
ఏప్రిల్ 22 నుంచి కర్ణాటకలో కొత్త షెడ్యూల్ మొదలవుతున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్ణాటకకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో నిర్మాతలతో కలిసి కనిపించిన ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్టైలిష్ అవతారంలో, జాకెట్ షర్ట్, కళ్లకు గాగుల్స్‌తో మరింత మాస్ అట్రాక్షన్ చూపించాడు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
ఎన్టీఆర్ సెట్స్‌లో అడుగుపెట్టనున్న సందర్భంగా, చిత్ర బృందం “మారణహోమానికి ముందు ప్రశాంతత” అంటూ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్, నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
The calm before the carnage… April 22nd 🌋#NTRNeel pic.twitter.com/nKizQWmqs7
— #NTRNeel (@NTRNeelFilm) April 20, 2025

One thought on “ఎన్టీఆర్-నీల్ మాస్ ఫైర్కి కౌంట్‌డౌన్ స్టార్ట్!”
Comments are closed.