రాజాసాబ్ తర్వాత స్పిరిట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Prabhas Spirit movie update

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. అదే సమయంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. ఫౌజీ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరగా, రాజాసాబ్ ఆలస్యం కావడంతో ఫౌజీ ముందుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయబోతున్నాడు.

స్పిరిట్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సమ్మర్ నుంచి స్పిరిట్ షూటింగ్ ప్రారంభమవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ లొకేషన్స్ ఎంపిక పనిలో బిజీగా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో స్పిరిట్ సినిమా పక్కన పెట్టారని వస్తున్న రూమర్స్‌కి యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

యూనిట్ వర్గాల ప్రకారం స్పిరిట్ సినిమాను ఆలస్యం అయినా తప్పకుండా ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రీ-ప్రొడక్షన్ చకచకా జరుగుతోందని, తక్కువ గ్యాప్‌లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోల్చితే ఇది మరింత హింసతో నిండిన మాస్ అట్రాక్షన్ మూవీ అవుతుందని అంచనా.

యానిమల్ సినిమా సక్సెస్‌తో సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా రేంజ్‌లో హైప్ పెంచుకున్నాడు. అందువల్ల ప్రభాస్ – సందీప్ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిరిట్ ప్రాజెక్ట్‌ను వదిలే ప్రసక్తే లేదని టీమ్ స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read More


One thought on “రాజాసాబ్ తర్వాత స్పిరిట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Comments are closed.