కృతి షెట్టి స్టైల్‌: డెనిమ్ స్కర్ట్‌లో బ్రాండెడ్ లుక్

Kriti Shetty Stylish Look

తెలుగు ప్రేక్షకుల మనసును “ఉప్పెన” సినిమాతో దోచుకున్న హీరోయిన్ కృతి షెట్టి తాజాగా తన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి సోషల్ మీడియా హల్ చల్ చేసింది. ఒక ప్రముఖ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ, కృతి స్టయిలిష్ హూడీ, డెనిమ్ స్కర్ట్, మరియు యెల్లో షూస్ లో స్టన్నింగ్ పోస్టులు షేర్ చేసింది. ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

ఇన్‌డోర్ లో సాఫ్ట్ లైట్ ఎఫెక్ట్‌తో తీసిన ఫోటోలు కృతిని మరింత అందంగా చూపించాయి. ఆమె మినిమల్ మేకప్ లోనూ ఫేస్ గ్లో, ఎక్స్‌ప్రెషన్స్ తో తన ప్రత్యేకమైన ఆకర్షణను కనబరిచింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలపై రివర్స్ కామెంట్స్ పెడుతూ, ఆమె కొత్త ఫ్యాషన్ స్టైల్ ను ప్రశంసిస్తున్నారు.

ఈ ఫోటోషూట్ ద్వారా కృతి షెట్టి, బ్రాండింగ్ పరంగా తన కెరీర్‌ను మరో మైలురాయికి తీసుకెళ్లింది. “ఉప్పెన” తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ పెద్ద హిట్స్ రాలేకపోయినా, ఫ్యాషన్ రంగంలో ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా స్థిరపడిపోయింది. ఫొటోషూట్లు మాత్రం ఆమెకు ఫుల్ అటెన్షన్ తెచ్చిపెట్టాయి.

అందమైన లుక్‌తో, “మీరు ఆకర్షించాలనుకునే శక్తిగా ఉండండి” అనే క్యాప్షన్‌తో ఆమె తన సరికొత్త ఫ్యాషన్ డిఫినిషన్‌ను ప్రదర్శించింది. త్వరలోనే కృతి షెట్టి మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్స్ లోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది.

Read More


One thought on “కృతి షెట్టి స్టైల్‌: డెనిమ్ స్కర్ట్‌లో బ్రాండెడ్ లుక్

Comments are closed.