కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు కురుపించారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు, 40 ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా-కెనడా సంబంధాలను నాశనమ చేసాయని అన్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ పెద్ద ముప్పుగా మారారని పేర్కొన్నారు. ఈ నెల 28న కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాంట్రియల్‌లో జరిగిన ఎన్నికల డిబేట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ, ట్రంప్ కారణంగా ఏర్పడిన పరిస్థితులను అధిగమించడానికి కెనడాలోని వాణిజ్య హద్దులను తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రావిన్సులు, టెరిటరీల సహకారం కీలకమని చెప్పారు. కెనడా ప్రజలకు ఆర్థిక లాభాలు అందించేందుకు ఇదే మార్గమని ఆయన తెలిపారు. తద్వారా, అధ్యక్ష పదవికి తిరిగి వచ్చాక, ట్రంప్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభిస్తానని చెప్పారు.
ట్రంప్, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేయాలని గత కొంతకాలంగా బెదిరిస్తున్నారు. కానీ కెనడా దీనికి ప్రతిస్పందించింది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే కెనడాపై భారీ టారిఫ్‌లు విధించారు. కెనడా కూడా ప్రతిగా అమెరికాపై టారిఫ్‌లు విధించింది. ట్రంప్ తన చర్యలు తగ్గించేవరకు తమ ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రధాని కార్నీ చెప్పారు.
Read More : అమెరికాలో విమానం ఇంజిన్‌లోకి కుందేలు..
