ఎన్టీఆర్ వార్ 2 ప్రభావం: ఢిల్లీ ఫైల్స్ వాయిదా!

Delhi Files movie postponed

బాలీవుడ్‌ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందిస్తున్న ‘ది ఢిల్లీ ఫైల్స్’ సినిమాను మేకర్స్ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15న విడుదల చేయాలని తొలుత అనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం, వార్ 2 సినిమా విడుదల కారణంగా పోటీ తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తయినా, వ్యూహాత్మక కారణాలతో విడుదలను వాయిదా వేశారు.

‘ది కశ్మీర్ ఫైల్స్’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనాయి. కానీ రాజకీయ దృష్ట్యా వివాదాస్పద అంశాలతో కూడిన ఈ సినిమా మరోసారి చర్చకు కేంద్ర బిందువయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా సినిమాలు రూపొందిస్తున్నారన్న విమర్శల మధ్య వివేక్ తన దారిలో సాగుతున్నాడు.

‘ది వాక్సిన్ వార్’ సినిమా విజయవంతం కాకపోవడంతో ఈసారి కమర్షియల్ యాంగిల్‌ను దృష్టిలో ఉంచుకుని ‘ది ఢిల్లీ ఫైల్స్’ రూపొందించినట్లు సమాచారం. రాజకీయ రహస్యాలు, సమకాలీన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వివాదాలను రేపే అవకాశముందని ఊహిస్తున్నారు.

ప్రస్తుతం ‘ది ఢిల్లీ ఫైల్స్’ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ భారీ స్థాయిలో విడుదల కావడంతో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడి నుంచి అధికారిక ప్రకటన వస్తే పూర్తి క్లారిటీ రానుంది.7

Read More

One thought on “ఎన్టీఆర్ వార్ 2 ప్రభావం: ఢిల్లీ ఫైల్స్ వాయిదా!

Comments are closed.