భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసుల వద్ద కేసు నమోదు

తిరుప‌తి: టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఎస్పీ హ‌ర్ష వ‌ర్ధ‌న్ రాజుకు ఫిర్యాదు చేశారు.

భూమన గోశాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఆయన ఎస్వీ గోశాల‌లో 100 ఆవులు మృతిచెందాయని, పవిత్ర గోశాల‌ను గోవధ శాలగా మార్చారని అనేది తప్పుడు ఆరోపణలుగా భానుప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.

భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదుపై, భూమన కరుణాకర్‌రెడ్డిపై బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read More : అమెరికాలో విషాదం : రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థిని వంగవోలు దీప్తి మృతి

2 thoughts on “భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసుల వద్ద కేసు నమోదు

Comments are closed.